అనంతపురం జిల్లా ఉరవకొండలో గడియార స్తంభం వద్ద యాచకుడు పడిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరిన ఎస్సై రమేశ్ రెడ్డి.. అతను మరణించినట్లు తెలుసుకున్నాడు. వెంటనే ఆపద్బాంధవ ట్రస్ట్ సభ్యులు, పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించారు. పంచాయతీ సిబ్బందితో కలిసి ట్రస్టు సభ్యులు ఆ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కూడా మానవత్వంతో ముందుకు వచ్చి యాచకుడికి అంత్యక్రియలు నిర్వహించిన ఆపద్బాంధవ ట్రస్ట్ సభ్యులను ఎస్సై రమేశ్ రెడ్డి, స్థానికులు అభినందించారు.
యాచకుడికి అంత్యక్రియలు నిర్వహించిన ఆపద్బాంధవ ట్రస్ట్ సభ్యులు - uravakonda latest news
కరోనా వల్లే కాదు... ప్రస్తుత పరిస్థితుల్లో ఆకలితోనూ మరణిస్తున్నారు . కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ కారణంగా రోడ్లపైకి వచ్చే జనాలు తక్కువ. దీంతో అనాథ వృద్ధులు, యాచకులు ఆకలితో అలమటించి తుది శ్వాస విడుస్తున్నారు. అలా మృతి చెందిన ఓ వ్యక్తికి ఆపద్బాంధవ ట్రస్ట్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
![యాచకుడికి అంత్యక్రియలు నిర్వహించిన ఆపద్బాంధవ ట్రస్ట్ సభ్యులు funeral](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:06:04:1620653764-ap-atp-72-10-orphan-beggar-death-trust-members-manavatwam-av-ap10097-10052021161349-1005f-1620643429-941.jpg)
యాచకుడికి అంత్యక్రియలు నిర్వహించేదుకు ఏర్పాట్లు