ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓబులదేవర చెరువు మండలంలో కుండపోత... రోడ్లు జలమయం - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది.

full rain at ananthapuram district
అనంతలో కుండపోతు వర్షం.... రోడ్లు జలమయం

By

Published : Jun 27, 2020, 5:32 PM IST

అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు మండలంలోని ఇనగళూరు, గాజుకుంట పల్లి గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమైన ఆకాశంతో ఈ రెండు గ్రామాల పరిధిలో ఒక్కసారిగా కుండపోతు వర్షం కురిసింది.

కదిరి సహా మిగతా ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. రహదారుల్లో వర్షపు నీరు వాగులా ప్రవహించగా... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చోదకులు వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. అరగంటపాటు కురిసిన వర్షంతో సాగుకు మేలని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details