Dr Rajeev Reddy Free Sugar and BP Tests: ఈ రోజుల్లో ముందుగా జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకంగా మారే వ్యాధుల్లో షుగర్, బీపీ కీలకంగా ఉన్నాయి. వీటిని ముందుగా గుర్తించక, గుర్తించినా అదుపుచేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోక.. చాలా మంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలని భావించిన అనంతపురానికి చెందిన డాక్టర్ రాజీవ్ రెడ్డి …నగరంలో చక్కెరవ్యాధి, రక్తపోటు వ్యాధుల ఉచిత కౌన్సెలింగ్ పరీక్షలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అంటూ ప్రత్యేక సంచార వాహనం ఏర్పాటు చేశారు. షుగర్, బీపీ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వేలమందిని పరీక్షించారు. వందలాది రోగులను గుర్తించారు.
వ్యాధులకు ఉచిత కౌన్సిలింగ్ పరీక్షలు..ప్రాణాలు తీసే అనారోగ్య సమస్య వచ్చాక వైద్యం చేయించటం కంటే, ముందుగానే వ్యాధిని గుర్తించి అదుపు చేస్తే ప్రాణాపాయం తప్పించవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించటం లేదు. ప్రస్తుతం సమాజంలో జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకంగా మారిన వ్యాధుల్లో షుగర్, బీపీలు కీలకంగా ఉన్నాయి. ఈ రెండిటిని ముందుగా గుర్తించకపోవటమో.. ఒకవేళ గుర్తించినా వాటిని అదుపుచేయటానికి తగిన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ రెండు వ్యాధులను ముందుగానే గుర్తించే పరీక్షలు ఎక్కడా నిర్వహించక పోవటం వల్ల, రోగుల కోసం భారీగా బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన అనంతపురానికి చెందిన యువ వైద్యుడు డా రాజీవ్ రెడ్డి నగరంలోచక్కెరవ్యాధి, రక్తపోటు వ్యాధుల ఉచిత కౌన్సిలింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.