దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. అనంతపురం జిల్లాలో కరోనా విజృంభించడంతో భాజపా నాయకులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వ్యాప్తి నివారణ కోసం టవర్ క్లాక్ వద్ద దాదాపు 400 మందికి బుల్లెట్ కషాయం బాటిళ్లను ఉచితంగా అందించారు. ఉదయం, సాయంత్రం వేడినీళ్లలో ఈ కషాయం కలుపుకుని తాగాలని ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ ఈ కషాయం తాగవచ్చని తెలిపారు. కరోనా నివారణకు ఈ మందు పని చేస్తుందని వారు పేర్కొన్నారు .
అనంతలో కషాయం బాటిళ్లు ఉచిత పంపిణీ - ఈటీవీ భారత్ తాజా వార్తలు
అనంతపురంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో భాజపా నాయకులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వైరస్ వ్యాప్తి నివారణ కోసం కషాయం బాటిల్స్‌ను ప్రజలకు ఉచితంగా అందించారు. కరోనా వైరస్ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలను తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
![అనంతలో కషాయం బాటిళ్లు ఉచిత పంపిణీ free infusions bottles distribution at ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7815407-521-7815407-1593426854533.jpg)
అనంతలో ఉచిత బుల్లెట్ కషాయం బాటిళ్ల పంపిణీ