అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని పీసీ గ్రామానికి చెందిన జయరామరెడ్డి అనే పారిశ్రామికవేత్త తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గుడిబండలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు, 108, 104 సిబ్బందికి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న సుమారు 200 మంది కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా విజృభిస్తున్న తరుణంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికుల సేవలను ఆయన కొనియాడారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నా పూర్తి జీతాలు అందక, అరకొర జీతాలతో జీవనం సాగిస్తున్న తమను గుర్తించి నిత్యావసరాలను పంపిణీ చేసినందుకు కార్మికులు జయరామరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతపురంలో కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - etv bharat latest updates
కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని పీసీ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త జయరామరెడ్డి... గుడిబండలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు నిత్యావసరాలను పంపిణీచేశారు. అరకొర వేతనాలతో జీవనం సాగిస్తున్న తమను గుర్తించి నిత్యావసరాలను అందజేసినందుకు కార్మికులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతపురంలో కార్మికులకు నిత్యావసరాల పంపిణీ