అనంతపురంలో ద్విచక్ర వాహనాలను దొంగలించే నలుగురు వ్యక్తులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షలు విలువైన 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కొన్ని రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు మాయమవుతున్నాయి. వీటిపై బాధితుల ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, డీఎస్పీల ఆదేశాల మేరకు పోలీసుల ప్రత్యేక బృందంతో నిందితులను పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. జల్సాల కోసం చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నలుగురు బైక్ దొంగల అరెస్ట్.. 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం - అనంతపురంలో ద్విచక్ర వాహనాలను దొంగలించిన వారిని పట్టుకున్న పోలీసులు
ద్విచక్ర వాహనాలను దొంగలించే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షలు విలువ చేసే 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
![నలుగురు బైక్ దొంగల అరెస్ట్.. 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం Two-wheeler thieves arrested](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:20:53:1622454653-ap-atp-11-31-bikes-theft-4members-arrest-av-ap10001-31052021144838-3105f-1622452718-488.jpg)
ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్