అనంతపురంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 18 కల్తీ మద్యం బాటిళ్లు, శానిటైజర్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు యూట్యూబ్‌లో కల్తీ మద్యం తయారీ విధానం తెలుసుకున్నారు. తయారు చేసిన కల్తీ మద్యం బాటిల్స్‌ను గుట్టుచప్పుడు కాకుండా మందుబాబులకు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
యూట్యూబ్‌లో చూసి మద్యం తయారీ.. నలుగురు అరెస్ట్
కల్తీ మద్యం తయారీ చేసి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అనంతపురం జిల్లా ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 కల్తీ మద్యం బాటిళ్లు, శానిటైజర్స్ స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్‌లో చూసి మద్యం తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కల్తీ మద్యం తయారీ చేసి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్టు
ఇవీ చూడండి...