ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులో పడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి - Anantapur latest updates

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చెరువులో పడి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగింది.

Four members of the same family fell into a pond in Penukonda, Anantapur district and died
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

By

Published : Mar 15, 2021, 8:56 AM IST

అనంతపురం జిల్లా పెనుకొండలో విషాదం జరిగింది. భోగ సముద్రం చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అనంతపురానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు 17 మంది పెనుకొండ బాబయ్యస్వామి దర్గాకు వచ్చారు. కుటుంబంలో ఇటీవల ఓ వ్యక్తికి వివాహం జరిగింది. స్వామి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులంతా పెళ్లి పూలు నీటిలో కలిపేందుకు భోగ సముద్రం చెరువు వద్దకు చేరుకున్నారు.

చెరువు నీటిలో పెళ్లి పూలు వేస్తుండగా ప్రమాదవశాత్తు అల్లా బక్ష్ ‌(42), అతడి కుమారుడు షేక్‌షా వలీ (17), కుమార్తె తస్లీమా (14), తోడల్లుడు మహ్మద్‌ సాదిక్ ‌(40) చెరువులో మునిగిపోయారు. స్థానికులు, బంధువులు చెరువులో గాలించినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చెరువులో గాలింపు చేపట్టి నలుగురిని వెలుపలికి తీశారు. అప్పటికే వారంతా మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details