అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని తేరు వీధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడింది. ఆటో డ్రైవర్ రామచంద్ర, ప్రయాణికురాలు సుభద్రమ్మ, ఏడాదిన్నర వయసున్న తరుణ్ అనే బాలుడికి కాళ్లు విరిగిపోయాయి. సీతమ్మ అనే మరో మహిళ గాయపడింది. క్షతగాత్రులంతా ధర్మవరం తొగట వీధి వాసులు. ఆశ అనే గర్భిణికి చికిత్స అందించడం కోసం అంతా కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారందరిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో, లారీ ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు - ఆటో లారీ ఢీ..నలుగురుకి తీవ్ర గాయాలు
గర్భిణికి చికిత్స చేయించే నిమిత్తం ఆటోలో బయల్దేరిన ఓ కుటుంబసభ్యులకు.. లారీ రూపంలో ప్రమాదం ఎదురైంది. నలుగురిని తీవ్ర గాయాలపాలు చేసింది.
ఆటో లారీ ఢీ..నలుగురుకి తీవ్ర గాయాలు