అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని ఎర్రమంచిలో గల కియా కార్ల తయారీ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు... గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారు బెంగుళూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుంది.
ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మనోజ్ విట్టల్, అతనితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
మద్యం మత్తులోనే ప్రమాదం జరిగిందా..!