KHORDHA ROAD ACCIDENT: ఒడిశా రాష్ట్రంలోని ఖోర్ధా జిల్లా జంకియా పోలీసు స్టేషన్ పరిధిలోని బడాపోఖారియా సమీపంలో 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భువనేశ్వర్‌కు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ఖోర్ధాలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు మృతి - four died in road accident
4 Persons Died in Road Accident: రోడ్డు ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ప్రయాణ సమయంలో అతి వేగం కారణంగా నలుగురు ప్రాణాలు విడిచారు. వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డు ప్రమాదం