కియా పరిశ్రమలో ఉద్యోగాల కోసం భూనిర్వాసితుల ఆందోళన - formers protest infront of kia motors ananthapuram dist
తమకు కియా పరిశ్రమలో ఉద్యోగాలివ్వాలంటూ... పరిశ్రమ కోసం భూములిచ్చిన రైతుల పిల్లలు ఆందోళన చేపట్టారు.

కియా పరిశ్రమలో ఉద్యోగాలివ్వాలంటూ భూనిర్వాసితులు ఆందోళన
అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. పరిశ్రమకోసం భూములు కోల్పోయిన వారి పిల్లలకు ఉద్యోగాలివ్వాలని భూనిర్వాసితుల పిల్లలు ధర్నా నిర్వహించారు. కియా ప్రధాన గేటులో టైర్లకు నిప్పపెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా, ఏపీఐఐసీ అధికారులతో సమావేశం నిర్వహించి భూనిర్వాసితుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని పెనుగొండ తహశీల్దార్ నాగరాజు తెలిపారు.
TAGGED:
kia motors