ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Petro pirces effect: పెట్రో మంట తట్టుకోలేక.. గుర్రపు బండీతో రైతన్న బతుకు పయనం! - farmer using a horse cart in Kalyanadurgam

పెరుగుతున్న పెట్రో ధరలను తట్టుకొలేక అశ్వాన్ని తన వాహనంగా మార్చుకున్నాడు ఓ రైతు. ఎరువుల బస్తాలను పట్టణం నుంచి తీసురావటానికి.. ఈ వాహనాన్నే వాడుతున్నాడు. ప్రస్తుతం గుర్రపు దాణా ఖర్చు.. ఇంధన ఖర్చు కంటే తక్కువగా ఉందని అంటున్నాడు.

hourse cort
గుర్రం బండిని వినియోగిస్తున్న రైతు

By

Published : Aug 17, 2021, 12:01 PM IST

గుర్రం బండిని వినియోగిస్తున్న రైతు

నానాటికీ పెరిగిపోతున్న పెట్రో ధరలను తట్టుకోలేక బైకుకు స్వస్తిపలికిన ఓ రైతన్న.. గుర్రం బండిపై తన పనులు చేసుకోవడం మొదలుపెట్టాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జున పల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు.. తన పొలానికి వెళ్లి రావడానికి.. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణదుర్గం పట్టణం నుంచి ఎరువుల బస్తాలు తీసుకెళ్లడానికి గుర్రపుబండిని వినియోగిస్తున్నాడు. చమురు​ ధరలు పెరగిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.

''నాలుగైదు రోజుల పాటు బస్తాలను వాహనంపై తీసుకెళ్లాలంటే 300 నుంచి 400 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. మోటార్ సైకిల్ పై తీసుకెళ్లడానికి వీలులేకుండా పోయింది. ఒక బస్తా తీసుకెళ్లినా.. ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. తప్పని పరిస్థితుల్లో జట్కాని తయారు చేయించి గుర్రాన్ని కొన్నా. పెట్రోల్ ఖర్చులతో పోలిస్తే గుర్రపు దాణా ఖర్చులు కూడా తక్కువగా ఉన్నాయి'' - ఆంజనేయులు, రైతు

ABOUT THE AUTHOR

...view details