వ్యవసాయ భూమి రహదారి వివాదం పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా గాండ్లపెంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తుమ్మలబైలు తండాకు చెందిన సురేంద్రనాయక్ కుటుంబానికి స్థానికంగా మరో కుటుంబానికి పొలం రహదారి విషయంలో వివాదం నడుస్తోంది. తన పొలంలోని పండ్ల మొక్కలను ప్రత్యర్థులు నరికేశారని... సమస్య పరిష్కరించాలని కొన్నేళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు సురేంద్రనాయక్ తెలిపాడు. ఎంతకాలమైనా అధికారులు స్పందించలేదంటూ.... కుటుంబ సభ్యులతో సహా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నాడు. కిరోసిన్ మీద పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న వాళ్లు స్పందించి సురేంద్రనాయక్‌పై నీళ్లు పోసి ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - అనంత జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం
వ్యవసాయ భూమి వివాదం పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా గాండ్లపెంటలో ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
![తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5008478-1044-5008478-1573274007113.jpg)
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
Last Updated : Nov 9, 2019, 3:15 PM IST