ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీలకంఠేశ్వర ఆలయ ధ్వజారోహణ వేడుక.. పాల్గొన్న రఘువీరారెడ్డి - Former PCC president Raghuveer Reddy latest news

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ధ్వజారోహణ వేడుకలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ధ్వజస్తంభం వద్ద మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని పండితులు ఘనంగా నిర్వహించారు.

Former PCC president Raghuveer Reddy
మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి

By

Published : Jul 22, 2021, 9:44 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ధ్వజారోహణ వేడుకలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజస్తంభం వద్ద మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం విశ్వక్షేణపూజా, పుణ్యాహవచనం నవకలశారాధన, పంచామృతాభిషేకం, మండల పూజ హోమాలు, మహా పూర్ణహుతి, నీరాజన మంత్రపుష్పం పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details