ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే ఆదేశాలతోనే రాత్రంతా పోలీస్ స్టేషన్​లో... - anantapur district latest news

ఎమ్మెల్యే ఆదేశాలతోనే తెదేపా నేతలను రాత్రంతా పోలీస్ స్టేషన్​లో ఉంచారని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. నగరంలోని ఓ పోలీసు అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు.

former mla prabhakar choudhary  fire on mla venkatarami reddy
ఎమ్మెల్యే ఆదేశాలతోనే రాత్రంతా పోలీస్ స్టేషన్​లో...

By

Published : Mar 9, 2021, 4:34 PM IST

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆదేశాలతోనే తెదేపా నేతలను రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచారని అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. స్నేహితులైన అభ్యర్థుల కోసం ప్రచారం చేయటానికి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను రాత్రంతా పోలీస్ స్టేషన్​లో ఉంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఓ పోలీసు అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తూ... ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నికల ముందు అధికారులు.. రాజకీయ పార్టీల నేతలను పిలిపించి మాట్లాడేవారని, ఈ ప్రభుత్వంలో అధికారులు నిర్వీర్యం అయ్యారని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అన్నారు. ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవన్నారు.

ABOUT THE AUTHOR

...view details