ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గర్భిణికి చికిత్స అందించలేదని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం - former mla hanumantha chowdari news

సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణికి వైద్యం అందించలేదని మాజీ ఎమ్మెల్యే హనుమంత చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఆస్పత్రి ముందు బైఠాయించి సిబ్బందిపై మండిపడ్డారు.

former MLA
ఆరోగ్య కేంద్రం ముందు బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే

By

Published : Nov 14, 2020, 6:49 AM IST

అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణికి వైద్యం అందించలేదని మాజీ ఎమ్మెల్యే హనుమంత చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నాగమ్మకు పురిటినొప్పులు రావటంతో కుందుర్పి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు సంబంధించిన ఆరోగ్య వివరాలు ఏమిలేవని వైద్యం అందించలేదు. మండలంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేకు విషయం తెలిసి ఆరోగ్య కేంద్రం ముందు బైఠాయించి..ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు. నాగమ్మ వివరాలు లేవని..పరీక్షలు చేసేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవటంతో ఆమెకు చికిత్స అందించలేకపోయామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details