అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం పత్తేపురం గ్రామాన్ని మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి సందర్శించారు. ఎన్నికల అనంతరం హత్యకు గురైన రాజు అనే తెదేపా కార్యకర్తను పరామర్శించేందుకు.. ఈ నెల 9వ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు తెదేపా నాయకులు పత్తేపురంలో పర్యటించారు.
పత్తేపురంలో పర్యటించిన మాజీమంత్రులు - పరిటాల సునీత
అనంతపురం జిల్లా పత్తేపురం గ్రామంలో మాజీమంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి పర్యటించారు. స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు.

పత్తేపురంలో పర్యటించిన మాజీమంత్రులు