ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హెచ్ఎల్​సీ నీటి కేటాయింపుల్లో అనంతపురం జిల్లాకు అన్యాయం'

అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెదేపా నేత కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. హెచ్ఎల్​సీ నీటి కేటాయింపుల్లో ప్రభుత్వం జిల్లాకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

former minister, tdp leader kalava srinivasulu fire on ycp government about hlc water divide
తెదేపా నేత కాలవ శ్రీనివాసులు

By

Published : Feb 6, 2021, 8:25 PM IST

తుంగభద్ర ఎగువ కాలువ నీటి కేటాయింపుల్లో అనంతపురం జిల్లాకు ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. కనేకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన... తుంగభద్ర రిజర్వాయర్​కు పుష్కలంగా నీరు వచ్చినప్పటికీ... హెచ్ఎల్​సీ కేటాయింపులు సరిగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు సకాలంలో నీటిని అందించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కనేకల్ చెరువు కింద వరి సాగు చేసిన రైతులకు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పటికైనా హెచ్ఎల్​సీకి నీళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

పార్టీలకు అతీతంగా విశాఖ నేతలంతా రాజీనామా చేయాలి: గంటా

ABOUT THE AUTHOR

...view details