ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణస్నేహితుడి పాడె మోసిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి - former minister raghuveera reddy news

ప్రాణస్నేహితుడైన బలరామిరెడ్డి అంత్యక్రియల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు. గుండెపోటుతో మరణించిన మిత్రుడి పాడెను మోసి.. స్నేహబంధాన్ని చాటుకున్నారు.

former minister raghuveera reddy
స్నేహితుని అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి రఘువీరా రెడ్డి

By

Published : Apr 10, 2021, 4:34 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం పాపసానిపల్లి గ్రామానికి చెందిన బలరామిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, బలరామిరెడ్డి ప్రాణ స్నేహితులు. బలరామిరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి.. అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న రఘువీరారెడ్డి పాపసానిపల్లికి వెళ్లారు. మిత్రుడి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి, కన్నీరు పెట్టుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న రఘవీరారెడ్డి మిత్రుడి పాడెను మోసి.. వారి స్నేహబంధాన్ని చాటుకున్నారు.

ఇదీ చదవండి:అధికారుల నిర్లక్ష్యంతోనే నా భర్త మృతి: దేవపుత్ర భార్య

ABOUT THE AUTHOR

...view details