ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్యసాయి బాబా జయంతిపై ప్రభుత్వ నిర్లక్ష్యం - మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

సత్యసాయి బాబా జయంతి నిర్వణకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. ఈ నెల 18 నుంచి జరగాల్సిన వేడుకలకు ఇప్పటి వరకు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆయన విమర్శించారు. పుట్టపర్తి నగరంలో పాటు పుట్టపర్తికి వచ్చే అన్ని ప్రధాన రోడ్లు చాలా అధ్వానంగా తయారయ్యాయని, వాటి మరమ్మతులు గాలికి వదిలేశారని పేర్కొన్నారు.

Former minister Palle Raghunathreddy
సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం

By

Published : Nov 8, 2020, 11:37 AM IST

సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. ఈ నెల 18 నుంచి జరగాల్సిన వేడుకలకు ఇప్పటి వరకు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆయన విమర్శించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన... జయంతి ఏర్పాట్లను పరిశీలించారు. గతం ప్రభుత్వం ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక నిధులు కేటాయించేదని అన్నారు. కానీ ప్రస్తుతం నామ మాత్రపు సమీక్షా, సమావేశాలతో జయంతి వేడుకలను నిర్లక్ష్యం చేస్తున్నారని పల్లె విమర్శించారు. పుట్టపర్తి నగరంతో పాటు అక్కడికి వచ్చే అన్ని ప్రధాన రోడ్లు చాలా అధ్వానంగా తయారయ్యాయని, వాటి మరమ్మతులు గాలికి వదిలేశారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details