ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది' - అనంతపురం జిల్లా వార్తలు

వైకాపా నేతలు...భూములు ఆక్రమించటం, విగ్రహాలు ధ్వంసం, ఎస్సీలపై దాడులు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పల్లె రఘునాథరెడ్డి హెచ్చరించారు. రైతులకు న్యాయం చేయటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమరావతి పోరు చరిత్రలో నిలిచిపోతుందన్న ఆయన...రాష్ట్రవ్యాప్తంగా అమరావతి కోసం ఉద్యమించాలన్నారు.

palle raghunathareddy
palle raghunathareddy

By

Published : Dec 16, 2020, 7:24 PM IST

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

వైకాపాకు నేతలను వేధింపులకు గురి చేస్తుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఈ పద్ధతిని మార్చుకోవాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతపురంలో మాట్లాడిన ఆయన రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నివర్ తుపానుతో అనంతపురం జిల్లావ్యాప్తంగా రైతులు నష్టపోతే కేవలం 33 మండలాలను మాత్రమే ఇన్​పుట్ రాయితీకి ఎంపిక చేయటం దుర్మార్గమన్నారు.

భూములు ఆక్రమించటం, విగ్రహాలు ధ్వంసం, ఎస్సీలపై దాడులు చేయటం వంటివి మానుకోకపోతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పల్లె రఘునాథరెడ్డి హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించడంలో, రైతులకు న్యాయం చేయటంలో విఫలమైందని ఆరోపించారు. వైకాపా పాలనలో దేవుళ్లకు రక్షణ లేదన్నారు. అమరావతిలో రైతులు ఏడాది ఉద్యమం చేస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదన్నారు. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జగన్​ తీరుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

ఇదీ చదవండి :ఏలూరు వింత వ్యాధికి పురుగుమందులే కారణం..!

ABOUT THE AUTHOR

...view details