వైకాపా ఏడాది పాలనపై అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఛార్జిషీట్ విడుదల చేశారు. విధ్వంసానికి ఒక్క ఛాన్స్ పేరుతో.. వైకాపా పాలనలోని పలు అంశాలను ఛార్జిషీట్లో ప్రస్తావించారు. నయా నియంతృత్వ పోకడలతో జగన్ అన్ని వర్గాలను తీవ్ర నిరుత్సాహానికి గురిచేశారని ఆయన ధ్వజమెత్తారు. తెదేపా చేపట్టిన అనేక కార్యక్రమాలను రాజకీయ దురుద్దేశ్యంతోరద్దు చేస్తూ.. ఏడాది కాలంలో అభివృద్ధిని ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. విభజన హక్కులను సాధించకోవడంలో భాగంగా తెదేపా పనిచేసిందని గుర్తుచేశారు. సీఎం జగన్ హైదరాబాద్‌లోని ఆస్తులను.. అక్కడి సీఎం కేసీఆర్‌కు రాసిచ్చారని ఆరోపించారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా.. సీఎం జగన్ అధ్వాన్న పాలన సాగించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు పార్థసారధి అన్నారు.
' ఒక్క ఛాన్స్ అంటూ..అభివృద్ధిని ధ్వంసం చేశాడు' - విధ్వంసానికి ఒక్క ఛాన్స్
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. వైకాపా ఏడాది పాలనపై అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఛార్జిషీట్ విడుదల చేశారు.
వైకాపా పాలనపై కాలువ శ్రీనివాసులు ఛార్జ్‌షీట్