అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామంలో ఇటీవల మరణించిన ఉప్పర ఈశ్వరప్ప కుటుంబాన్ని రాష్ట్ర మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పరామర్శించారు. వేరుశెనగ కాయల కోసం రాయదుర్గం ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కు వెళ్లి క్యూలో నిలబడి అస్వస్థతకు గురై... ఈశ్వరప్ప మరణించాడు. ఈ సందర్భంగా మృతుడు ఈశ్వరప్ప భార్య పిల్లలను కాల్వ శ్రీనివాసులు పరామర్శించి... పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. తెలుగుదేశం పార్టీ రైతు కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈశ్వరప్ప కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
ఈశ్వరప్ప కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి: కాలవ - అనంతపురం జిల్లా
ఇటీవల మరణించిన రైతు ఉప్పర ఈశ్వరప్ప కుటుంబాన్ని రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పరామర్శించారు.
![ఈశ్వరప్ప కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి: కాలవ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3839449-1080-3839449-1563125973643.jpg)
రైతు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కాలవ
రైతు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కాలవ
ఇవీ చదవండి...ఆంధ్రాలో భాజపాకు ఉజ్వల భవిష్యత్తు: రామ్ మాధవ్