ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'న్యాయస్థానాల ఆదేశాలను ధిక్కరించి పరిపాలన సాగిస్తున్నారు' - Anantapur district TDP leaders demands

ప్రభుత్వంపై హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శనాస్త్రాలు సంధించారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండల కేంద్రంలో తెదేపా నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింటే కేవలం 33 మండలాల రైతులకు మాత్రమే నష్ట పరిహారం కల్పించారని మాజీ ఎంపీ ఆరోపించారు. న్యాయస్థానాల ఆదేశాలు ధిక్కరించి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

formal mp nimmala kishtappa  serious
మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప

By

Published : Dec 6, 2020, 11:02 PM IST

వర్షాల కారణంగా అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింటే కేవలం 33 మండలాల రైతులకు మాత్రమే పరిహారం కల్పించారని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆరోపించారు. ఇందుకేనా సీఎం జగన్ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని మండిపడ్డారు. రానున్న రెండేళ్లలో హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి మడకశిర నియోజవర్గానికి నీరు అందించాలని, తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానమైనా నిలబెట్టుకోవాలని సూచించారు.

అసెంబ్లీలో ప్రభుత్వ తప్పిదాలను, హామీలను బయట పెడతారనే ఉద్దేశంతో ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల ఆదేశాలు ధిక్కరించి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు విరుద్ధంగా చట్టాలు తెచ్చే నిర్ణయాలను శాసనమండలిలో వ్యతిరేకించామని గుర్తుచేశారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించేందుకు వస్తే తప్పకుండా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details