దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రేమ జంట భారతీయ సంప్రదాయాలతో మంగళ వాయిద్యాల నడుమ ఒక్కటైంది. ప్రేమికులు.... జోడీ, దీపికల కుటుంబీకులు సత్యసాయి భక్తులు కావడం వల్ల తరచూ పుట్టపర్తికి వస్తుండేవారు. మన దేశ సంస్కృతి పట్ల ఆకర్షితులై పుట్టపర్తిలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సత్యసాయి జన్మస్థలమైన శివాలయంలో వేదమంత్రోచ్చరణల మధ్య, తెలుగు సంప్రదాయ పద్ధతుల్లో వీరి కల్యాణం చూడముచ్చటగా జరిగింది. వివాహ వేడుకకు తరలివచ్చిన వధూవరుల బంధుమిత్రులు తరలివచ్చారు. ఊరేగింపులో నృత్యాలు వేసి సంబరాలు చేసుకున్నారు.
దక్షిణాఫ్రికా జంట... భారతీయ సంప్రదాయంలో ఒక్కటైంది..! - south africa couple marriage in indian style
భారతీయ సంస్కృ తిని మరిచి పాశ్చాత్య పొకడల వెంట మనవాళ్లు పరిగెడుతున్న రోజులివి. కానీ భారత దేశ సంస్కృతి సంప్రదాయాలపై విదేశీయులు మాత్రం మక్కువ చూపుతున్నారు. ఎక్కడో దక్షిణాఫ్రికా చెందిన ఓ జంట భారతీయ సంప్రదాయంలో మంగళ వాయిద్యాల నడుమ వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు.
దక్షిణాఫ్రికా ప్రేమ జంట... భారతీయ సంప్రదాయంలో ఒక్కటైంది..!