అనంతపురం జిల్లా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళ, బుధవారాల్లో దర్శనాలు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆలయంలో పనిచేసే ముగ్గురు సిబ్బందికి కరోనా లక్షణాలు కనిపించటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ ఈవో విజయ సాగర్ బాబు తెలిపారు. ఆలయాన్ని శానిటైజ్ చేసిన అనంతరం గురువారం నుంచి దర్శనాలను పున:ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని.. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు.
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనాలు 2 రోజులు నిలిపివేత - అనంతపురం జిల్లా నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం
అనంతపురం జిల్లా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుంచి రెండు రోజుల పాటు దర్శనాలు నిలిచిపోయాయి. ముగ్గురు ఆలయ సిబ్బందికి కరోనా లక్షణాలు కనిపించటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రెండురోజుల పాటు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనాలు నిలిపివేత