ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లి భోజనం మరుసటి రోజు తిన్నాక ఏమైందంటే? - 9 మంది అస్వస్థత

కలుషిత ఆహారం తిని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వివాహం నుంచి తీసుకొచ్చిన లడ్డూ, చక్కెర పొంగలిని మరుసటి రోజు తిన్న వారు ఆసుపత్రిపాలయ్యారు. అనంతపురం జిల్లా విడపనకల్లులో జరిగిన ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

food-poisoning

By

Published : May 30, 2019, 10:01 AM IST

కలుషిత ఆహారం తిని 9 మంది అస్వస్థత
అనంతపురం జిల్లా విడపానకల్ మండలం కరకముక్కల గ్రామంలో కలుషిత ఆహారం తిని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో నలుగురు చిన్నారులు, ఐదుగురు పెద్దవాళ్ళు ఉన్నారు. వీరిలో ఒక గర్భిణి ఉంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ కుటుంబం వివాహానికి వెళ్లి వచ్చి చుట్టుపక్కల వారికి గత రాత్రి లడ్డు చక్కెర పొంగలి పంచిపెట్టారు. వీటిని తీసుకున్న కుటుంబ అప్పటికే భోజనం చేసి ఉండడంతో అలాగే ఉంచారు. ఉదయం పనికి వెళ్లి వచ్చిన తర్వాత దాన్ని తిన్నారు. కొద్దిసేపటికే వారికి వాంతులు విరోచనాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details