ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కస్తూర్బా బాలికల హాస్టల్​లో ఫుడ్ పాయిజన్.. పది మందికి అస్వస్థత - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

Food poison in Kasturba Girls Hostel: శింగనమల కస్తూర్బా బాలికల వసతి గృహాంలో పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 10 రోజుల క్రితమే ఇలాంటి ఘటన చోటు చేసుకోగా.. తాజాగా మళ్లీ అలాంటి ఘటన పునరావృతం కావడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Singanamala Kasturiba Girls Hostel
కస్తూరిబా బాలికల వసతి గృహం

By

Published : Dec 23, 2022, 10:47 PM IST

Food poison in Kasturba Girls Hostel: అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల వసతి గృహంలో పది మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పది రోజుల క్రితమే 20 మంది విద్యార్థినులు హాస్టల్లో.. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విషయం మరవక ముందే.. కలుషిత ఆహారం తిని మళ్లీ కడుపునొప్పితో విద్యార్థినులు శింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

వసతి గృహంలో సిబ్బంది మధ్య గొడవలు కారణంగానే.. ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పది రోజుల వ్యవధిలోని విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరో పక్క రెండు వర్గాల సిబ్బంది గొడవల కారణంగా విద్యార్థినులపై ప్రతాపం చూపిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details