అనంతపురం జిల్లా మడకశిరలో భాజపా రాష్ట్ర కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సేవాహి సంఘటన్ ద్వారా రోగులు, అనాథలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కొన్ని రోజులుగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులు, పలువురు వైద్య సిబ్బందికి ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్నారు.
అలాగే.. పట్టణంలోని శ్రీ సాయి శల్య చికిత్సాలయంలోని రోగులు, అనాథలకు ఆహారం అందిస్తూ.. ప్రజల మన్ననలు పొందుతున్నారు. కరోనా కష్టకాలంలో ప్రతి రోజు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని చంద్రశేఖర్ పేర్కొన్నారు.