అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్.. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదానం చేశారు. ఆయన సతీమణి సోనీగ్ర… కరోనా నుంచి కోలుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటించి.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు వంద మందికి పైగా అన్నదానం చేశారు. జేసీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదానం.. జేసీకి అభినందనలు - food distribution at government hospital news
అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్.. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని జేసీ కోరారు.
అన్నదానం కార్యక్రమం