అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం తారకపురంలో 6 వేరుశనగ పొట్టు, గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. వీరికి గ్రామస్తులు సహకరించారు. వీటి విలువ రూ. 4 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ అనిల్ కుమార్ పరిశీలించారు. విద్యుదాఘాతంతో ప్రమాదం సంభవించిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.
తారకపురంలో గడ్డివాముల దగ్ధానికి కారణాలేంటి..? - తారకపురంలో పశుగ్రాసం దగ్ధం వార్తలు
తారకపురంలో 6 వేరుశనగ పొట్టు, గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు కారణాలను పరిశీలిస్తున్నామని తహసీల్దార్ తెలిపారు.
![తారకపురంలో గడ్డివాముల దగ్ధానికి కారణాలేంటి..? fodder burned at tarakapuram in ananthpuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6937379-670-6937379-1587826272739.jpg)
తారకపురంలో పశుగ్రాసం దగ్ధం