మరోసారి జలదిగ్బంధంలో యాడికి మండల కేంద్రం - floods in yamidi in ananthapuram
అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రం మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. గత నెల 23న కురిసిన వర్షానికి పిన్నెపల్లి చెరువుకు గండి పడింది. అధికారులు మరమ్మతులు చేపట్టని కారణంగా.. సమస్య పెరుగుతోంది.

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రం మరోసారి వరదనీటిలో చిక్కుకుంది.గత నెల23న కురిసిన వర్షానికి వరదనీరు చేరి పిన్నెపల్లి చెరువుకు గండిపడి వరద పొంగింది.అధికారులు మరమ్మతులు చేయకపోవడం.. సమస్యను తిరగబెట్టింది. ఇందుకు తోడు... మళ్లీ వర్షాలు పడి వరదనీరు కాలనీల్లోకి చేరింది.చెన్నకేశవ కాలని,చౌడేశ్వరి కాలని,అంబేడ్కర్ కాలని,లాలేప్ప కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.సమచారం అందుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వరద ప్రాంతానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.చెరువుకు మొదట గండిపడినపుడే చర్యలు చేపట్టినట్లయితే వరద బాధలు తప్పేవని స్థానికులు అన్నారు.