అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ నెల 24న జరిగిన వైకాపా, తెదేపా నాయకుల ఘర్షణ కేసులో ఐదుగురు వైకాపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పలపాడు రవి, బాబా, కేశవరెడ్డి, ఓబుల్ రెడ్డి, రమణలను అదుపులోకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నించిన కారును పోలీసులు సీజ్ చేశారు.
తాడిపత్రి ఘర్షణ కేసు: ఐదుగురు వైకాపా నేతల అరెస్ట్ - jc prabhaker reddy attack issue latest news
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో ఐదుగురు వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు.
తాడిపత్రి ఘర్షణ కేసు
తాడిపత్రి పట్టణంలో ఈ నెల 24న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లికి వెళ్లి.. ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం తెదేపా, వైకాపా కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు.
ఇదీ చదవండి: తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి...