పెరుగుతున్న కరోనా కేసులు.. తాడిపత్రిలో ఐదు రెడ్జోన్లు - thadipatrhi corona updates
కరోనా వ్యాప్తి దృష్ట్యా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఐదు ప్రాంతాలను అధికారులు రెడ్జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 12 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... కరోనాతో ఒకరు మృతి చెందారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఐదు ప్రాంతాలను అధికారులు రెడ్జోన్లుగా ప్రకటించారు. పట్టణంలోని నందలపాడు, సీపీఐ కాలనీ, సంజీవ్ నగర్, కృష్ణాపురం ఒకటో రోడ్డు, కాల్వగడ్డ, గన్నేవారిపల్లి కాలనీల్లో ఇప్పటివరకు 12 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. అప్రమత్తమైన అధికారులు పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వైరస్ నివారణ కొరకు బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.