ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ - thadipatri corone positive cases latest news
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు కరోనా బాధితులను బత్తులపల్లికి తరలించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మొదటి సారిగా ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు కరోనా బాధితులను బత్తలపల్లికి తీసుకెళ్లారు. ఇటీవల ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు చెన్నై నుంచి తాడిపత్రికి వచ్చారు. అధికారులు వారిని మొదట ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగిటివ్ రావటంతో హోం క్వారంటైన్లో ఉండాలని చెప్పి ఇంటికి పంపించారు. రెండో సారి వారి నమూనాలు తీసుకుని పరీక్షలకు పంపగా... ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు కాలనీకి వచ్చి ముగ్గురు చిన్నారులతో సహా కరోనా బాధితులను బత్తులపల్లికి తరలించారు. కాలనీ వారు బయట తిరగకూడదని హెచ్చరించారు. ఆ ప్రాంతమంతా సోడియం హైడ్రోక్లోరిన్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.