ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుత్తిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా.. ఐదుగురు అరెస్టు - రేషన్ బియ్యం అక్రమ రవాణా ఐదుగురు అరెస్ట్ వార్తలు

ప్రభుత్వం పేదలకు కోసం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమదారులు అడ్డదారి పట్టిస్తున్నారు. గుత్తి మండలంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Five members arrested for smuggling ration rice
రేషన్ బియ్యం అక్రమ రవాణా ఐదుగురు అరెస్టు

By

Published : Dec 1, 2020, 9:04 AM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం కరడికొండ గ్రామ శివార్లలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరిడికొండ గ్రామ శివార్లలోని ఖాళీస్థలంలో రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో.. తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని డీఎస్పీ చైతన్య తెలిపారు. 500 బస్తాల అక్రమ రేషన్ బియ్యంతోపాటు.. వాటి రవాణాకు వినియోగించే లారీ, రెండు ఆటోలు, బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని కొనడానికి వస్తే అలాంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా డీఎస్పీ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గుత్తి సీఐ రాము, ఎస్ఐ మహబూబ్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details