కళ్యాణదుర్గంలో 'ఫిట్ ఇండియా కార్యక్రమం' - కళ్యాణదుర్గంలో ఫిట్ ఇండియా కార్యక్రమం
కళ్యాణదుర్గంలో ప్రైవేటు విద్యాసంస్థలు నిర్వహించిన ఫిట్ ఇండియా కార్యక్రమం ఆకర్షించింది. ఆరోగ్య నియమాలు పాటించి వ్యాధుల బారిన పడకుండా ఉండాలని విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు.
కళ్యాణదుర్గంలో 'ఫిట్ ఇండియా కార్యక్రమం' నిర్వహించిన విద్యార్థులు
'ఫిట్ ఇండియా కార్యక్రమం' పేరిట కళ్యాణదుర్గంలో ప్రైవేటు విద్యాసంస్థలు నిర్వహించిన కార్యక్రమం ప్రజలను ఆకట్టుకుంది. విద్యార్థులు టీ సర్కిల్లో ప్రదర్శన నిర్వహించి ఆరోగ్య నియమాలు, యోగా, వ్యాయామం తదితర అంశాలపై ప్రదర్శన నిర్వహించారు. డ్రైఫ్రూట్స్ తినడం వల్ల పలు వ్యాధులకు దూరంగా ఉండవచ్చని విద్యార్థులు వివరించారు.