ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం నుంచి యూపీకి బయల్దేరిన తొలి శ్రామిక్ రైలు - anantapur district news

అనంతపురం జిల్లాలోని ఉత్తరప్రదేశ్ వలస కార్మికుల తరలింపు కోసం తొలి శ్రామిక్ రైలు బయల్దేరి వెళ్లింది. దాదాపు 1500 మంది వలస కూలీలు సొంత స్వస్థలాలకు వెళ్లారు.

first sramik train start from anantapur  to uttar pradesh
first sramik train start from anantapur to uttar pradesh

By

Published : May 19, 2020, 11:07 AM IST

చిరువ్యాపారాల కోసం, దుకాణాల్లో, పరిశ్రమల్లో పనిచేయటానికి అనంతపురం వచ్చిన ఉత్తరప్రదేశ్ వాసులను తిరిగి వారి ప్రాంతాలకు పంపించారు. సోమవారం తొలి శ్రామిక్ రైలు జిల్లా నుంచి బయల్దేరింది. శ్రామిక్ రైలు ద్వారా వీరితో పాటు బెంగుళూరు నుంచి రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళుతున్న వారిలో కొందర్ని యూపీకి పంపారు. అనంతపురం నుంచి శ్రామిక్ రైలులో దాదాపు 1500 మందికిపైగా ఉత్తరప్రదేశ్​కు వెళ్లారు. ఇందుకోసం జిల్లా అధికారులు రైల్వేశాఖకు 13 లక్షల రూపాయలు చెల్లించారు. తొలి శ్రామిక్ రైలులో పంపుతున్న వారికి ప్రభుత్వం టికెట్ తోపాటు భోజనం, తాగునీరు అందిస్తున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ చెబుత్నారు.

ABOUT THE AUTHOR

...view details