ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నామినేషన్ల ప్రక్రియ: ఆదేశాలు ఇవ్వని కలెక్టర్లు.. వెనక్కి వెళ్తున్న అభ్యర్థులు - అనంతపురంలో నామినేషన్ల స్వీకరణ

రాష్ట్రంలో తొలిదశ స్థానిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. ఈ మేరకు.. గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని పంచాయతీ కార్యాలయాలకు అభ్యర్థులు తరలివెళ్తున్నారు. కానీ.. కలెక్టర్ నుంచి ఆదేశాలు రాలేదంటూ నామపత్రాలను సిబ్బంది తీసుకోని కారణంగా.. కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్ల ఆదేశాలు రాకపోవడంతో అభ్యర్థులు వెనక్కి వెళ్తున్నారు.

first day   nominations as part of the  local body  elections arrangements  in state
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

By

Published : Jan 25, 2021, 12:36 PM IST

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో తొలిదశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. కలెక్టర్ల నుంచి ఆదేశాలు రాలేదంటూ.. చాలా ప్రాంతాల్లో ఇంకా కార్యాలయాల గదులే తెరవలేదు. మరి కొన్ని చోట్ల సాధారణ విధులకు సిబ్బంది హాజరైనా.. అభ్యర్థులనుంచి నామ పత్రాలు తీసుకోకుండా వెనక్కి పంపిస్తున్నారు.

గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లాలో నామినేషన్ల స్వీకరణ కోసం అధికారుల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పంచాయతీ కార్యాలయానికి పత్రాలు చేరుకున్నాయి.

అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు వచ్చిన అభ్యర్థులు వెనక్కి వెళ్తున్నారు. కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాలేదని.. ఆదేశాలు రాగానే ప్రక్రియ చేపడతామని పెనుకొండ ఎంపీడీవో కార్యాలయం అధికారులు తెలిపారు.

హిందూపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్లు తీసుకునేందుకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. నామినేషన్లు సమర్పించాల్సిన గదికి ఇంతవరకు సిబ్బంది తాళం కూడా తీయలేదు. పోలింగ్ కు సంబంధించిన మెటీరియల్ ఆఫీసుకు చేరలేదని సిబ్బంది అంటున్నారు.

చిలమత్తూరు, లేపాక్షిలోనూ ఇదే పరిస్థితి. తూముకుంట మండలంలో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వైకాపా అభ్యర్థి షమీన్‌ తాజ్‌ను అధికారులు వెనక్కి పంపించారు.

ఇదీ చూడండి:

4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details