రైతు తిమ్మప్పది అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని ఓబుళాపురం గ్రామం. అతని పొలంలో వేరుశెనగను వేశాడు. పగలనక..రాత్రనక ఆరుగాలం ఎంతో కష్టపడి సాగుచేశాడు.అయితే వేరుశెనగ కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారు జామున నిప్పు పెట్టారు. పొలంలో మంటలు వ్యాపించడంతో గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంట మొత్తం కాలిపోయింది. ఆరుగాలం శ్రమించి.. అప్పులు చేసి పండించిన పంట... నూర్పిడి చేసే సమయంలో ఇలా అగ్నికి ఆహుతి అయ్యి పూర్తిగా కాలిపోవడంతో తిమ్మప్ప పంటను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. పశుగ్రాసంకి కూడా పనికి రాకుండా పోయిందని కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు రూ.2లక్షలు వరకు ఆస్తి నష్టం కలిగినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. ప్రభుత్వమే తమకు సహాయం అందించి ఆదుకోవాలని తిమ్మప్ప కోరుతున్నాడు. ఈ అగ్ని ప్రమాదంపై కసాపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
FIRE : పంట కుప్పకు నిప్పు...కన్నీరు మున్నీరైన రైతు...ఏం జరిగింది ? - groundnut crops in Ananthapuram district
ఆ పొలంలో మంటలు వ్యాపించాయి. గమనించిన చుట్టుపక్కల స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. రైతు తిమ్మప్పకు కబురు చేశారు. వచ్చి చూసి...కన్నీటి పర్యంతమయ్యాడు తిమ్మప్ప. ఆరుగాలం కష్టం ఇలా బూడిద అవ్వడం చూసి తట్టుకోలేకపోయాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని ఓబుళాపురం గ్రామంలో జరిగింది.
పంట కుప్పకు నిప్పు...కన్నీరు మున్నీరైన రైతు