ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్​కే వర్సిటీ ఆవరణలో గడ్డికి నిప్పుపెట్టిన దుండగులు - Fire accident on SK University campus

గుర్తుతెలియని వ్యక్తులు అనంతపురంలోని ఎస్​కే యూనివర్సిటీ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో ఉన్న గడ్డికి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు.

Fire accident on SK University campus
ఎస్​కే వర్సిటీ ఆవరణలో మంటలు

By

Published : Jan 29, 2021, 8:35 PM IST

అనంతపురంలోని ఎస్​కే యూనివర్సిటీ ఆవరణలో మంటలు చెలరేగాయి. మంటలు పెద్దఎత్తున వ్యాప్తి చెంది యూనివర్సిటీ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో ఉన్న గడ్డి చాలా వరకు కాలిపోయింది. మంటలను గమనించిన వర్సిటీ అధికారులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. విద్యార్థులే సిగరెట్లు కాల్చి వేయడంతో మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details