అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించింది. అగ్నిమాపక వారోత్సవాల్లో మాక్ డ్రిల్ చేపట్టారు. స్థానికంగా ఉండే అవకాశాలతో మంటలు ఎలా అదుపు చేయాలో వివరించారు.
సిలిండర్ నుంచి మంటలు వచ్చినప్పుడు కార్బైన్ డై ఆక్సైడ్‌ను ఉపయోగించి ఆర్పే విధానం తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలి, ప్రాణాపాయం సంభవించకుండా ప్రథమ చికిత్స ఎలా అందించాలో తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా చేసిన విన్యాసాలు స్థానికులను ఆకట్టుకున్నాయి.
ఉరవకొండలో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ - fire
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు.... స్పందించే తీరును ప్రయోగాత్మకంగా వివరించారు

ఉరవకొండలో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్
ఉరవకొండలో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్
ఇదీ చదవండి