ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నికి ఆహూతైన... ఐదు సంవత్సరాల కష్టం - fire accident in pomegranate garden news

ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. చేతికి అంది వస్తుందనుకున్న రైతు ఆశలపై.. ఆకతాయిలు నీళ్లు చల్లారు. ఐదు సంవత్సరాలుగా కాపాడుకుంటున్న తోటకు నిప్పు పెట్టటంతో.. జీవనాధారమైన దానిమ్మ చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.

fire broken out in pomegranate garden
దానిమ్మ తోట దగ్ధం

By

Published : Mar 27, 2021, 9:44 AM IST

చేతికి అంది వచ్చే పంటను.. ఆకతాయిలు అగ్నికి ఆహుతి చేశారంటూ అనంతపురం జిల్లా గుడిబండ మండలం హిరేతుర్పికి చెందిన.. రైతు ఎల్లప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాలుగా ఎల్లప్ప సాగు చేసుకుంటున్న దానిమ్మ తోటకు.. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే పంట పూర్తిగా దగ్ధమైందనీ రైతు ఎల్లప్ప ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఉన్న రెండున్నర ఎకరాల భూమిలో.. దానిమ్మ, చింత చెట్లు వేశాననీ.. 5 సంవత్సరాలుగా వాటి ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నానని ఎల్లప్ప తెలిపారు. జీవనాధారమైన తోట అగ్నికి ఆహుతి అయ్యిందని.. నష్టపోయిన తనను అధికారులు ఆదుకోవాలని కోరాడు.

ABOUT THE AUTHOR

...view details