ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం - అనంతపురం వార్తలు

విద్యుదాఘాతం వల్ల ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన అనంతపురం నగరంలోని సూర్యనగర్​లో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దుకాణంలో తొమ్మిది లక్షలు విలువ చేసే దుస్తులు ఉన్నాయని యజమాని ఆవేదన చెందాడు.

fire at cloths shop at Anantapur due to electric shock
విద్యుదాఘాతంతో బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం

By

Published : Jun 30, 2021, 10:32 AM IST

అనంతపురం నగరంలో విద్యుదాఘాతం వల్ల ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని సూర్యనగర్ 80 అడుగుల రోడ్డులో ఉన్న బట్టల దుకాణంలో ఈ ఘటన సంభవించింది. షాపులో మంటలు రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు.

దుస్తులు పూర్తిగా కాలిపోయాయని దుకాణం యజమాని వాపోయాడు. సాయంత్రం ఐదు గంటలకు దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్లానని ఆయన తెలిపారు. 7 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు తొమ్మిది లక్షల విలువ చేసే సరకు.. దుకాణంలో ఉందని అతను వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details