అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం పుట్లూరు రోడ్డు వద్ద ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్వెర్టర్ వద్ద విద్యుదాఘాతం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన దుకాణం సిబ్బంది.. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. దాదాపు రూ.20లక్షల విలువైన వస్త్రాలు మంటల్లో కాలిపోయినట్లు నిర్వహకులు తెలిపారు.
విద్యుదాఘాతంతో బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం - Fire at a clothing store with eurrent shock newsupdates
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం పుట్లూరు రోడ్డు వద్ద బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని నిర్వహకులు తెలిపారు.
![విద్యుదాఘాతంతో బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం Fire at a clothing store with eurrent shock](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5500138-137-5500138-1577362635185.jpg)
విద్యుదాఘాతంతో బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం