అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బీటీపీ రోడ్డు ఎస్సీ కాలనీలో విషాదం జరిగింది. ఇంట్లో నిలవ ఉంచుకున్న పెట్రోల్ తగలబడి మంటలు చెలరేగాయి. ఇల్లు మొత్తం దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో చిక్కుకున్న నాగమ్మ (65) అనే వృద్ధురాలు, చంద్ర (5) అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు వారికి ప్రాథమిక చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం అంబులెన్స్‌లో బళ్లారి విమ్స్‌కు తరలించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెట్రోల్ తగలబడి... ఇళ్లు దగ్ధం - corona news in anantapur dst
ఇంట్లో ఉన్న పెట్రోలు తగలబడి... ఇల్లంతా దగ్ధమైన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా... బళ్లారి ఆసుపత్రికి తరలించారు.
ఇంట్లో ఉన్న పెట్రోల్ తగలబడి...ఇళ్లే దగ్ధం