ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నిప్రమాదం.. రూ.20 లక్షల విలువైన పట్టు చీరలు ఆహుతి - శివ బాలాజీ సిల్క్​లో అగ్నిప్రమాదం

అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఓ పట్టు చీరల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతం కారణంగా జరిగిన ప్రమాదంలో రూ. 20 లక్షల విలువైన చీరలు కాలి బూడిదయ్యాయి.

fire accident in silk sarees shop in Dharmavaram
శివ బాలాజీ సిల్క్​లో అగ్నిప్రమాదం

By

Published : Mar 31, 2021, 10:54 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఓ పట్టు చీరల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ. 20 లక్షల విలువైన చీరలు కాలి బూడిదయ్యాయి. జనార్దన్ అనే వ్యాపారి.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వెనుక శివ బాలాజీ పట్టు చీరల దుకాణం నిర్వహిస్తున్నారు. దుకాణంలో విద్యుత్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. అప్పటికే దుకాణంలోని చీరలు కాలి బూడిదయ్యాయి. రూ. 20 లక్షలకు పైగా విలువైన పట్టు చీరలు కాలిపోయాయాని యాజమాని జనార్ధన్ కన్నీటి పర్యంతమయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details