అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరులో అగ్నిప్రమాదం జరిగింది. నిప్పంటుకొని 10 గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామ సమీపంలో ఒకే చోట రైతులు 50కి పైగా గడ్డి వాములు వేసుకున్నారు. ఉన్నట్టుండి మంటలు చెలరేగగా.. వాటిని అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గడ్డి నిల్వలు పూర్తిగా కాలిపోయి పశువులకు మేత లేకుండా పోయిందని రైతులు వాపోయారు. దాదాపు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం - అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
అనంతపురం జిల్లా పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిప్పంటుకొని 10 గడ్డివాములు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గడ్డి దగ్ధంతో పశువులకు మేత లేకుండా పోయిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
fire accident in Paltur ananthapuram district
Last Updated : Mar 31, 2021, 9:06 AM IST