ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలకు గడ్డివాముతో పాటు మూడు బర్రెలు కాలి తీవ్రంగా దెబ్బతిన్న ఘటన అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఎండు గడ్డి, మొక్కజొన్న కుప్పలు పూర్తిగా కాలిపోయాయి. మంటలంటుకున్న 3 బర్రెల్లో ఒకదాని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు ఆవేదన చెందారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
నారాయణపురంలో అగ్ని ప్రమాదం... అదుపు చేసిన యంత్రాంగం - ananthapuram latest updates
నారాయణపురంలో జరిగిన అగ్నిప్రమాదంలో గడ్డివాము కాలిపోయింది. పక్కనున్న మూడు బర్రెలకు గాయాలయ్యాయి. ఒక బర్రె పరిస్థితి విషమంగా ఉంది.
నారాయణపురం గడ్డివాముకు అంటుకున్న నిప్పు